HomeUncategorizedCWC Meeting | ఉగ్రవాదులపై చర్యలు చేపట్టాలి : సీడబ్ల్యూసీ

CWC Meeting | ఉగ్రవాదులపై చర్యలు చేపట్టాలి : సీడబ్ల్యూసీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CWC Meeting | పహల్​గామ్​ pahalgamలో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ CWCలో తీర్మానం చేశారు. శుక్రవారం సాయంత్రం రెండు గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ముందుగా పహల్​గామ్​ ఉగ్రదాడి pahalgam terror atttack మృతులకు నాయకులు సంతాపం తెలిపారు. ఉగ్రదాడిపై న్యాయం కోసం దేశం ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.

CWC Meeting | రాజకీయాలకు సమయం కాదు

ఇది రాజకీయాలకు సమయం కాదని, ఉగ్రదాడి నిందితులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని సీడబ్ల్యూసీ సభ్యులు అన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు దీర్ఘకాలిక పునరావాసం, మానసిక మద్దతు కల్పించాలని కోరారు. ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం central govt ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ congress మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా లోపాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు.

CWC Meeting | కులగణనపై తీర్మానం

కులగణన caste census పై సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. కులగణనపై కాంగ్రెస్ వాచ్‌డాగ్ పాత్ర పోషించాలని తీర్మానం చేశారు. పారదర్శకంగా ఈ ప్రక్రియను చేపట్టాలని డిమాండ్​ చేశారు.

Must Read
Related News