అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలో అనుమతులు లేని పాఠశాలలు అడ్మిషన్లు తీసుకుంటున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్(AISF) రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం కోరారు. ఈ మేరకు సోమవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌ఛార్జి డిప్యూటీ తహశీల్దార్ నవీన్‌కు వినతిపత్రం అందజేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థ విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నాయని వివరించారు. ఈ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్‌ఎస్‌వో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జీవన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అజయ్, ఏఐఎస్ఎఫ్ బాన్సువాడ మండల కన్వీనర్ వంశీ, ఏఐఎస్ఎఫ్, ఎల్‌ఎస్‌వో, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.