అక్షరటుడే, ఇందూరు: ABVP Indur Vibhag | ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ శశిధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డీఈవో అశోక్‌కు (DEO Ashok) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు(Corporate schools) బుక్స్, స్టేషనరీ విక్రయిస్తున్నారని తెలిపారు. అలాగే సీబీఎస్సీ (CBSC), ఇంటర్నేషనల్ స్కూల్స్ (International Schools) అంటూ తోక పేర్లతో ఉన్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలన్నారు. వినతి పత్రం అందించిన వారిలో నగర కార్యదర్శి బాలకృష్ణ, కంఠేశ్వర్ జోనల్ ఇన్‌ఛార్జి దుర్గాదాస్, సిద్ధూ, అంబరీష్, సన్నీ, ఈశ్వర్, శ్రీకాంత్, నితీష్ తదితరులు పాల్గొన్నారు.
ABVP Indur Vibhag | అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
5
previous post