Gandhari Mandal
Gandhari Mandal | భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

అక్షర టుడే, గాంధారి: Gandhari Mandal | మండలంలోని మాతుసంగెం గ్రామంలో భూ కబ్జాకు (land grabbers) పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకుడు మోతిరాం డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రేణుక చవాన్‌కు (Tahsildar Renuka Chavan) వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలోని 119, 175 సర్వేనంబర్లలో 45 ఎకరాలను గిరిజనులు, దళితులు సాగు చేస్తున్నారని, అయితే కొందరు అక్రమార్కులు ఆ భూమిని ఆక్రమించి పట్టాల కోసం యత్నిస్తున్నారన్నారు. అక్రమార్కుల నుంచి భూమిని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాయిలు, సురేష్, రాములు, రాజు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.