Homeజిల్లాలునిజామాబాద్​AIFB | తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలపై చర్యలు తీసుకోవాలి

AIFB | తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలపై చర్యలు తీసుకోవాలి

తెయూలో అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఏఐఎఫ్​డీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు వర్సిటీ వీసీకి వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: AIFB | తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) 2012లో జరిగిన అక్రమ నియామకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఏఐఎఫ్​డీఎస్​ ప్రతినిధులు డిమాండ్​ చేశారు.

ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వర్సిటీ విశ్వవిద్యాలయం ఉపకులపతి యాదగిరిరావుకు హైకోర్టు తీర్పు (High Court verdict) కాపీని అందజేస్తూ ఉత్తర్వులను అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నిజామాబాద్​ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్, ఏఐఎఫ్​డీఎస్​ నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ.. 2012లో వర్సిటీలో జరిగిన నియామకాల్లో అవకతవకలు జరిగాయని సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. నాటి వీసీ, రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడ్డారని అప్పటినుంచి ఇప్పటివరకు సాగిన విచారణలో కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయినప్పటికీ వర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహించడం చూస్తుంటే అక్రమాలకు కొమ్ము కాసినట్లే అవుతుందన్నారు.

AIFB

AIFB | సిట్టింగ్​ జడ్జితో విచారణ చేయించాలి

అక్రమంగా నియామకమైన వారికి వీసీ, రిజిస్ట్రార్లు కొమ్ము కాసినట్టుగా స్పష్టమవుతుందని రాజు గౌడ్​ అన్నారు. ఈ విషయంలో జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud), రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర దర్యాప్తు కోసం సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు. అక్రమ నియమకాలపై నిగ్గు తేల్చాలన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని, దుర్వినియోగమైన రూ. కోట్ల నిధులను రాబట్టాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో నాయకులు బైరాపూర్ రవీందర్, జవారి రాహుల్, సుధాకర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News