అక్షరటుడే, ఇందూరు: TGVP Nizamabad | నగరంలోని అల్ఫోర్స్ కళాశాలపై(Alphores College) చర్యలు తీసుకోవాలని టీజీవీపీ(TGVP) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నగరంలో డీఐఈవో (DIEO) అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరానికి గాను కళాశాలకు అనుమతులు లేకున్నా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో కార్యకర్తలు మహేష్, సుజిత్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
