9
అక్షరటుడే, ఇందూరు : Nizamabad | బ్రాహ్మణుల (Brahmins)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సారయ్య, వారి బృందంపై చర్యలు తీసుకోవాలని ఇందూరు గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు శ్రీనివాస్ శర్మ (Srinivas Sharma) డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఏసీపీకి బుధవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యజ్ఞోపవీత ధారణ గురించి కట్టుబొట్టు గురించి అవమానిస్తూ మాట్లాడడం సమంజసం కాదన్నారు. బ్రాహ్మణ జాతి (Brahmin Community)ని హేళన చేస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు అజయ్ సంగ్వాయి, కృష్ణమాచారి, సుభాష్ శర్మ, రమేశ్ కులకర్ణి, సాయి ప్రసాద్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, జయంత్రావ్, రాజ కాంతారావు, ఉమామహేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.