అక్షరటుడే, నిజాంసాగర్: Private Schools | నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో అమర్‌సింగ్ పేర్కొన్నారు. గురువారం నిజాంసాగర్ (Nizamsagar), మహమ్మద్‌నగర్ (Mahammad Nagar) మండలాల్లోని పలు పాఠశాలలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలన్నారు. పుస్తకాలు, డ్రెస్సుల రూపంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలల్లో పరిసరాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచేలా చూసుకోవాలని సూచించారు.
