Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..
Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి(terrorist attack) ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులే దాడి చేశారని ఇప్పటికే ఆధారాలు సేకరించిన కేంద్ర నిఘావర్గాలు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించాయి. టీఆర్‌ఎఫ్‌(TRF) ఉగ్రవాద సంస్థకు సంబంధించిన నిందితుల ఊహాచిత్రాలను సైతం విడుదల చేశాయి. పాక్‌ సహకారంతోనే ఉగ్రదాడి జరిగిందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ దేశ హై కమిషన్‌పై చర్యలకు ఉపక్రమించింది.

హై కమిషన్‌లో సిబ్బందిని కుదిస్తూ.. బుధవారం నిర్ణయం తీసుకుంది. హై కమిషనర్‌కు(Pak high commission) సమన్లు జారీ చేసింది. అలాగే ఢిల్లీలోని కార్యాలయం వద్ద భద్రతను సైతం తొలగించింది. అలాగే ఆ దేశ సలహాదారులంతా వారంలోపు భారత్‌ విడిచి వెళ్లిపోవాలని సూచించింది. రానున్న రెండ్రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.