Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Collector | సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లులపై చర్యలు : కలెక్టర్

Kamareddy Collector | సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లులపై చర్యలు : కలెక్టర్

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | రైస్​ మిల్లర్లు వందశాతం సీఎంఆర్ డెలివరీ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. లేకపోతే సంబంధిత మిల్లులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్​లో​ మిల్లర్లు, పౌర సరఫరా అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ 2024-25 సంవత్సరానికి సంబధించి సెప్టెంబర్ 12 వరకు గడువు ఇచ్చిందన్నారు. ఆలోపు పెండింగ్ సీఎంఆర్ డెలివరీ (CMR delivery) పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా మిల్లింగ్ జరగాలన్నారు. నిర్ణీత సమయానికి సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలని ఆదేశించారు.

మిల్లర్లు (millers) వంద శాతం సీఎంఆర్ పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. గడువులోగా మిల్లింగ్​ పూర్తి చేసి అందజేయడంతో పాటు బ్యాంక్ గ్యారెంటీలు (bank guarantees) వారంలోగా జిల్లా కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, డీసీఎస్​వో మల్లిఖార్జున బాబు, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా రైస్ మిల్లర్స్​ కార్యవర్గం, జిల్లాలోని బాయిల్డ్ అండ్ రా రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

Must Read
Related News