అక్షరటుడే, వెబ్‌డెస్క్: Constable Transfer | పోలీస్ శాఖలో వసూళ్లకు పాల్పడుతున్న ఓ కానిస్టేబుల్‌పై బదిలీ వేటు పడింది. ఈ మేరకు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఉత్వర్వులు జారీ చేశారు.
నిజామాబాద్ ఒకటో టౌన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఖాలిద్‌పై సీపీ సాయిచైతన్య చర్యలు తీసుకున్నారు. బోధన్ టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తక్షణమే ఒకటో టౌన్ నుంచి రిలీవ్ చేయాలని ఎస్‌హెచ్‌వో రఘుపతిని ఆదేశించారు. కాగా.. ఒకటో టౌన్లో పనిచేస్తున్న ఖాలిద్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో పాటు స్టేషన్ బెయిల్, పలు కేసుల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఈ విషయమై సీపీ సాయిచైతన్యకు పలువురు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై తాజాగా ‘అక్షరటుడే’లో కథనం కూడా ప్రచురితమైంది. దీనిపై విచారణ జరిపించిన సీపీ సాయిచైతన్య ప్రాథమిక విచారణ అనంతరం కానిస్టేబుల్‌పై బదిలీ వేటు వేశారు. కాగా.. ఛార్జీ మెమో కూడా జారీ చేయనున్నట్లు సమాచారం.
Constable Transfer | వసూళ్లు చేయించిందెవరు..!
ఒకటో టౌన్ పరిధిలో గత కొద్దినెలలుగా అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు బలమైన ఆరోపణలున్నాయి. ఏ చిన్న కేసును కూడా వదలకుండా ముక్కుపిండి మరీ డబ్బులు దండుకుంటున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఈ వ్యవహారంలో ఖాలిద్ తెరముందుండి వసూళ్లు చేసినప్పటికీ.. తెరవెనుక వసూళ్లు చేయించినవారు ఎవరనేది చర్చ జరుగుతోంది. వారిపై కూడా చర్యలు ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.