అక్షరటుడే, నవీపేట్: ACB raids | నవీపేట మండల కేంద్రంలోని (Navipet mandal) కేజీబీవీపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇటీవల పీఎంశ్రీ నిధుల (PMSree funds) దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో విద్యాశాఖాధికారులు విచారణ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సమగ్రంగా విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
ఈ మేరకు మంగళవారం అధికారులు నేరుగా నవీపేట కేజీబీవీకి (Navipet KGBV) వెళ్లారు. గతంలో పీఎంశ్రీ కింద రూ.లక్షల్లో నిధులు విడుదల కాగా.. కొంతమేర నిధులు దుర్వినియోగం కావడంపై విచారణ జరిపారు. పీఎంశ్రీ నిధులు నవీపేట్, వర్ని కేజీబీవీలకు మంజూరయ్యాయి. అయితే నవీపేట్ పీఎంశ్రీ నిధులపై ఏసీబీ అధికారులు (ACB officials) ఆరా తీశారు. నిధులు సక్రమంగా ఖర్చు చేశారా..లేక ఎవరి అకౌంట్కు అయినా ట్రాన్స్ఫర్ చేశారా అని వివరాలు సేకరించారు. విచారణ నివేదికను హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయంలో సమర్పించనున్నట్లు సమాచారం.
