Homeజిల్లాలునిజామాబాద్​ACP | హెల్మెట్​ వాడకం పెంచాలి.. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి : ఏసీపీ

ACP | హెల్మెట్​ వాడకం పెంచాలి.. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి : ఏసీపీ

ACP | పీఎస్ దస్త్రాలను తనిఖీ ఏసీపీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, పలు సూచనలు చేశారు. దొంగతనాలు తగ్గించాలన్నారు. సీసీ కెమెరాల ఉపయోగం ప్రజలకు తెలిపి, వాటిని పెట్టించాలని సూచించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: ACP | వార్షిక తనిఖీల్లో భాగంగా నిజామాబాద్​ ఆరో ఠాణాను శనివారం ఏసీపీ రాజా వెంకటరెడ్డి సందర్శించారు.

పోలీస్​ స్టేషన్​ పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. పెండింగ్ కేసులపై రివ్యూ చేశారు.  కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ACP | పలు సూచనలు..

పీఎస్ దస్త్రాలను తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, పలు సూచనలు చేశారు. దొంగతనాలు తగ్గించాలన్నారు. సీసీ కెమెరాల ఉపయోగం ప్రజలకు తెలిపి, వాటిని పెట్టించాలని సూచించారు.

వాహనదారులకు అవగాహన కల్పించి, హెల్మెట్ వాడకం పెంచాలన్నారు. రోడ్డు నియమాలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్నారు.

సైబర్ నేరాలు, గాంజా వాడకంపై ప్రజలలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఏసీపీ వెంట సౌత్ రూరల్ సీఐ వెంకట్రావు, వినయ్, SHO వెంకట్రావు ఉన్నారు.

Must Read
Related News