HomeతెలంగాణHeart Attack | గుండెపోటుతో ఏసీపీ విష్ణుమూర్తి మృతి

Heart Attack | గుండెపోటుతో ఏసీపీ విష్ణుమూర్తి మృతి

ఏసీపీ విష్ణుమూర్తి ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గతంలో నిజామాబాద్​ టాస్క్​ఫోర్స్​లో పని చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heart Attack | గుండెపోటుతో ఏసీపీ (ACP) విష్ణుమూర్తి మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన సబ్బతి విష్ణుమూర్తి ఏసీపీగా పని చేస్తున్నారు. హైదరాబాద్​లోని తన నివాసంలో ఆయన ఆదివారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించారు.

విష్ణుమూర్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1991లో ప్రొబేషనరీ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో పని చేశారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో టాస్క్​ఫోర్స్ ఏసీపీ (Taskforce ACP)గా సైతం పని చేశారు. ఆయన మృతిపై తోటి ఉద్యోగులు సంతాపం తెలుపుతున్నారు.