అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Farmer | ప్రస్తుతం చాలా మంది అన్ని ఉన్నా.. ఏదో లేదని చెప్పి బాధ పడుతూ ఉంటారు. కానీ ఆ రైతు మాత్రం రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు (Higher education) చదివించాడు.
హన్మకొండ (Hanmakonda) జిల్లా కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన రాజు కూరగాయలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తనకున్న పొలంతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. పంట భూమి పక్కనే రోడ్డుపై తాను పండించిన కూరగాయాలు విక్రయించి లాభాలు పొందుతున్నాడు. దీంతో మార్కెటింగ్‌కు ఇబ్బందులు లేకుండాపోయాయి. ఆయనను కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి (Kazipet ACP Prashanth Reddy) అభినందించారు.
Farmer | అటుగా వెళ్తూ..
కాజేపీట ఏసీపీ విధి నిర్వహణలో భాగంగా అటుగా వెళ్తు రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్న రైతును చూసి ఆగారు. రైతు రాజుతో కొద్దిసేపు మాట్లాడారు. రాజు కృషిని ఆయన అభినందించారు. రాజు తన కూతురు ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసి నీట్ పీజీ కోసం ప్రిపేర్ అవుతోందని, కొడుకు బీటెక్ (B.Tech) ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని చెప్పారు. దీంతో ఏసీపీ సంతోషం వ్యక్తం చేశారు. కష్టపడి బిడ్డలను ఉన్నత చదువులు చదివించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో రాజుతో మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా రైతులను సపోర్ట్ చేసే అధికారులు ఉండాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Farmer | మనుసు నిండిపోయింది
‘‘విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న క్రమంలో ఒక అపురూప దృశ్యం కనిపించింది. ఒక రైతు కుటుంబం తమకున్న ఒక చిన్న కమతంలో కూరగాయల సాగు చేస్తూ, దారిన వెళ్లేవారికి తాజా కూరగాయల్ని చవకగా అమ్ముతున్నారు. ఆ రైతు సోదరుడితో కాసేపు ముచ్చటిస్తే మనసు నిండిపోయింది. ఇద్దరు పిల్లల్లో కూతురిని డాక్టర్, కొడుకుని ఇంజినీర్‌ను చేస్తూ, నిజాయితీతో కష్టాన్నే నమ్ముకునే నీ కుటుంబానికి నా జోహార్లు రాజు’’ అంటూ ఏసీపీ పోస్ట్ చేశారు.
View this post on Instagram