అక్షరటుడే, వెబ్‌డెస్క్: JEE Advanced | అధ్యాపకుల ప్రత్యేక శ్రద్ధతో పాటు ప్రణాళిక ప్రకారం చదవడంతో ఎలాంటి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుకోకుండానే జేఈఈ అడ్వాన్స్డ్లో జాతీయ స్థాయి ర్యాంకు (national level rank) సాధించానని ఎం.సంకీర్త్ తెలిపాడు. తొలి ప్రయత్నంలోనే ర్యాంకు పొందానని చెప్పాడు. తాను ఉత్తమ ర్యాంకు సాధించడంలో కాకతీయ ఒలింపియాడ్ లోని (Kakatiya) ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, వారాంతపు పరీక్షలే ముఖ్య కారణమన్నారు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో (JEE Advanced results) ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థి సంకీర్త్ మనోగతం..
JEE Advanced | తొలిప్రయత్నంలోనే సాధించా..
‘జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో (JEE Advanced results) తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించగలిగాను. ఇందుకు కాకతీయ అధ్యాపకుల బోధన ఎంతో ఉపయోగపడింది. ప్రతి సబ్జెక్టుపై అనుభవజ్ఞులైన అధ్యాపకులతో (experienced teachers) శిక్షణ అందించడంతో పాటు వారాంతపు పరీక్షలు నిర్వహించడం వల్ల లాంగ్ టర్మ్ కోచింగ్కు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక పరవేక్షణ ఉండడం.. ప్రతి సబ్జెక్టుపై కూలంకషంగా బోధించడంతో పాటు విద్యార్థుల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృతి చేయడం వల్ల సబ్జెక్టులపై పూర్తి పట్టుసాధించగలిగాను.
JEE Advanced | ప్రణాళికతో ముందుకు సాగాను
‘కాకతీయలో పాఠశాల స్థాయి నుంచే జేఈఈ, ఐఐటీ ఫౌండేషన్ (JEE and IIT Foundation) శిక్షణ అందుకున్నాను. లెక్చరర్లు చక్కని ప్రణాళికతో మాకు టీచింగ్ చేశారు. వారి శిక్షణతోనే జేఈఈ అడ్వాన్స్డ్లో (JEE Advanced) ర్యాంకు సాధించగలిగాను. నిత్యం ప్రణాళిక ప్రకారం చదువుకోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది’ అని సంకీర్త్ తెలిపాడు. విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించాలంటే.. స్కూల్ స్థాయిలోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒలంపియాడ్ విద్య (Olympiad education) అందిస్తే తప్పనిసరిగా భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలన్నదే నా ఆశయం.