ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Olympiad Education | ఒలంపియాడ్​ విద్యతోనే జేఈఈ అడ్వాన్స్​డ్​లో జాతీయ ర్యాంకు సాధించా.. విద్యార్థి సాయిసర్వజిత్...

    Olympiad Education | ఒలంపియాడ్​ విద్యతోనే జేఈఈ అడ్వాన్స్​డ్​లో జాతీయ ర్యాంకు సాధించా.. విద్యార్థి సాయిసర్వజిత్ మనోగతం..

    Published on

    అక్షరటుడే, ఎడ్యుకేషన్​ డెస్క్​: Olympiad Education | ఒలంపియాడ్​ విద్యతోనే జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో (JEE Advanced results) జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకు సాధించానని నిజామాబాద్ కాకతీయ ఒలింపియాడ్ ఐఐటీ/మెడికల్ ఫౌండేషన్ విద్యార్థి సాయిసర్వజిత్​ (Student Sai Sarvajit) తెలిపారు. ఎలాంటి లాంగ్​టర్మ్​ కోచింగ్​ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే 347 ర్యాంకు సాధించానని పేర్కొన్నారు. కళాశాలలో అందించిన ప్రత్యేక శిక్షణతో ర్యాంకు సాధించగలిగానని చెప్పాడు. తన విజయంలో అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో తన మనోగతాన్ని పంచుకున్నారు.

    “నేను 2025 ఐఐటీ అడ్వాన్స్​డ్​లో 347 ఆల్​ ఇండియా ర్యాంక్ సాధించాను. ఈ విజయంలో కాకతీయ విద్యాసంస్థ ప్రోత్సాహం ఎంతగానో ఉంది. నా తల్లిదండ్రులు సైతం నన్ను ప్రోత్సహించడం వల్లే ర్యాంకు సాధించగలిగాను. విద్యాసంస్థలో (educational institution) అందించిన ప్రత్యేక శిక్షణతో మెట్రోపాలిటన్​ సిటీల విద్యార్థులతో పోటీపడి ఉత్తమ ర్యాంకు పొందాను. విద్యార్థులు ఆల్​ ఇండియా ర్యాంకులు సాధించాలంటే.. స్కూల్​ స్థాయిలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను రెగ్యులర్​ సిలబస్​తో (regular syllabus) పాటు సరైన శిక్షణ ఉన్న ఒలంపియాడ్​ విద్య (Olympiad education) తప్పనిసరి. ఐఐటీ, మెడికల్​ ఫౌండేషన్​ శిక్షణతో (IIT and Medical Foundation training) పాటు ప్రతిరోజూ ప్రతి సబ్జెక్టుపై ‌‌‌‌‌‌‌‌‌‌ఇంటర్మీడియట్​ ఎంసెట్​ స్థాయి లెక్చరర్లతో ప్రత్యేక శిక్షణ ఇప్పించే విద్యాసంస్థలో చదవడం వల్ల ఇంటర్మీయట్​ స్థాయిలో రాణించగలరు.”

    ఈ ఆధునిక జాతీయ విద్యలో (national education) సంపూర్ణంగా రాణించాలంటే ఇంటర్మీయట్​లో మాత్రమే ఆతృత పడితే కుదరదు. “న్యూ స్కూల్​ విత్​ ఒలంపియాడ్​ ఫౌండేషన్​ ఫర్​ న్యూ జనరేషన్​” (Olympiad Foundation for New Generation) అనే సిద్ధాంతాన్ని తల్లిదండ్రులు తమ విద్యార్థులకు అందిస్తే ఐఐటీ, జేఈఈలలో ఉత్తమ ప్రతిభ కనబర్చగలుగుతారు. దీంతో విద్యార్థుల భవిష్యత్​ బాగుంటుంది. అప్పుడే అనుకున్న లక్ష్యం సాధిస్తారు.

    కాకతీయ విద్యాసంస్థలో (Kakatiya Educational Institution) అందించే ప్రత్యేక శిక్షణ వల్ల నేను ఈ విజయం సాధించాను. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండే విధంగా ఇప్పటి నుంచే గోల్​ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నాను.

    More like this

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....

    Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యమా. .! పోలీస్‌ రాజ్యమా..?

    అక్షర టుడే, ఆర్మూర్‌: Jeevan Reddy | రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమంటే.. పోలీస్‌ రాజ్యమన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌...

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...