More
    HomeజాతీయంMaharashtra Governor | మహారాష్ట్ర గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య దేవవ్రత్

    Maharashtra Governor | మహారాష్ట్ర గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య దేవవ్రత్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra Governor | మహారాష్ట్ర గవర్నర్​గా ఆచార్య దేవవ్రత్ (Acharya Devavrat) సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం గుజరాత్ (Gujarat)​ గవర్నర్​గా కొనసాగుతున్నారు.

    మహారాష్ట్రగా గవర్నర్​గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan)​ ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన గవర్నర్​ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) గుజరాత్​ గవర్నర్​గా ఉన్న ఆచార్య దేవవ్రత్‌ను మహారాష్ట్ర గవర్నర్​గా నియమించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ రాజ్ భవన్‌లో దేవవ్రత్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    కాగా మహారాష్ట్ర గవర్నర్​గా ఉన్న సీపీ రాధాకృష్ణన్​ ఎన్డీఎ తరఫున ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 9న జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. శుక్రవారం సీపీ రాధాకృష్ణన్​ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    Maharashtra Governor | దేవ​వ్రత్​ నేపథ్యం

    ఆచార్య దేవవ్రత్​ 1959లో పంజాబ్​లో జన్మించారు. ఆయన 1984 లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఆర్య సమాజ్ ప్రచారక్​గా, హర్యానాలోని కురుక్షేత్ర గురుకుల పాఠశాలకు ప్రిన్సిపాల్​గా పనిచేశారు. 2015 నుంచి ఆగస్టు 12 నుంచి 2019 జులై 21 వరకు హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​గా పని చేశారు. 2019 జులై 22 నుంచి గుజరాత్​ గవర్నర్​గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్​గా అదనపు బాధ్యతలు చేపట్టారు.

    More like this

    KTR | కుటుంబం అన్నాక గొడవలు ఉంటాయి.. బజార్ల పడి కొట్టుకోవద్దు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్​ పెట్టాయి. ఆ స్థానాన్ని...

    Pension Scheme | పింఛన్లను పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్​ ధర్నా

    అక్షరటుడే,బోధన్ : Pension Scheme | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్​ ప్రభుత్వం పింఛన్లను పెంచి ఇవ్వాలని...

    Hyderabad Metro | హైద‌రాబాద్ మెట్రోకి బ్రేక్ ప‌డ‌నుందా.. ఎల్&టి నిర్ణ‌యంతో అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి వైదొలగాలని దేశీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్...