ePaper
More
    Homeబిజినెస్​IPO | మురిపించిన ఏస్‌ ఆల్ఫా.. ముంచేసిన వాలెన్సియా

    IPO | మురిపించిన ఏస్‌ ఆల్ఫా.. ముంచేసిన వాలెన్సియా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో గురువారం ఐదు ఐపీవో(IPO)లు లిస్టయ్యాయి. ఇందులో ఒక మెయిన్‌ బోర్డు(Main board) ఐపీవో, నాలుగు ఎస్‌ఎంఈ(SME)లు ఉన్నాయి. మెయిన్‌ బోర్డు ఐపీవో ఫ్లాట్‌గా లిస్టవగా.. వాలెన్సియా ఇండియా నిండా ముంచింది. ప్రొ ఎఫ్‌ఎక్స్‌ టెక్‌ స్వల్ప లాభాలను ఇవ్వగా.. ఏస్‌ ఆల్ఫా టెక్‌, మూవింగ్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలు మంచి లాభాలను అందించాయి.

    IPO | ఇండో గల్ఫ్‌ క్రాప్‌సైన్సెస్‌..

    మార్కెట్‌నుంచి రూ. 200 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చిన ఇండో గల్ఫ్‌ క్రాప్‌సైన్సెస్‌ (Indogulf Cropsciences) షేర్లు గురువారం ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్‌ అయ్యాయి. ఐపీవో అలాట్‌ అయినవారికి ఎలాంటి లాభాలను అందించలేదు. ఐపీవో ప్రైస్‌ రూ. 111 కాగా.. అదే ధర వద్ద Trading ప్రారంభించింది. తొలి రోజు చివరికి స్వల్ప నష్టాలతో ముగిసింది.

    IPO | ప్రొ ఎఫ్‌ఎక్స్‌ టెక్‌..

    ప్రొ ఎఫ్‌ఎక్స్‌ టెక్‌ (PRO FX Tech) కంపెనీ రూ. 38.21 కోట్లు సమీకరించింది. ఈ కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ(NSE)లో లిస్టయ్యాయి. ఒక్కో షేరు ధర రూ. 87 కాగా.. 9.2 శాతం ప్రీమియంతో రూ. 95 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 14.66 శాతం లాభంతో రూ. 99.75 వద్ద ఉంది. ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు తొలిరోజే 14.66 శాతం లాభాలు ఆర్జించి పెట్టింది.

    IPO | వాలెన్సియా ఇండియా కంపెనీ..

    వాలెన్సియా ఇండియా(Valencia India) కంపెనీ రూ. 46.49 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. ఈ కంపెనీ షేర్లు గురువారం బీఎస్‌ఈ(BSE)లో లిస్టయ్యాయి. ఈ ఐపీవో ఇన్వెస్టర్లను నిండా ముంచింది. ఇష్యూ ప్రైస్‌ ఒక్కో షేరుకు రూ. 110 కాగా.. 20 శాతం డిస్కౌంట్‌(Discount)తో రూ. 88 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత మరో ఐదు శాతం తగ్గి రూ.83.60 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ కొట్టింది. తొలిరోజే 24 శాతం పెట్టుబడి హరించుకుపోయింది.

    IPO | మూవింగ్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌..

    రూ. 32.91 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చిన మూవింగ్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ (Moving Media Entertainment) కంపెనీ ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యింది. లిస్టింగ్‌ రోజు ఇన్వెస్టర్లకు స్వల్ప లాభాలను అందించింది. ఇష్యూ ప్రైస్‌ రూ. 70 కాగా.. రూ. 71 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత 5 శాతం పెరిగి రూ. 74.55 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ తాకింది. తొలి రోజు ఇన్వెస్టర్లకు 6.5 శాతం లాభాలు వచ్చాయి.

    IPO | ఏస్‌ ఆల్ఫా టెక్‌..

    ఏస్‌ ఆల్ఫా టెక్‌(Ace Alpha Tech) బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 30.40 కోట్లు సమీకరించింది. ఈ కంపెనీ ఆఫర్‌ చేసిన ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. రూ. 69 కాగా.. 17.39 శాతం ప్రీమియంతో రూ. 81 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత మరో ఐదు శాతం పెరిగి రూ. 85.05 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ కొట్టింది. అంటే ఈ కంపెనీ లిస్టింగ్‌ రోజున ఇన్వెస్టర్లకు 23.26 శాతం లాభాలను(Profit) అందించింది.

    More like this

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...