అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | నిజామాబాద్ నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 70 గ్రాముల బంగారం, ఇతర వస్తులువు స్వాధీనం చేసుకున్నారు.
రూరల్ సీఐ శ్రీనివాస్ (Rural CI Srinivas) తెలిపిన వివరాల ప్రకారం.. బైంసాకు చెందిన హైమద్ హుస్సేన్, అబూబకర్ ఖానాపూర్ చౌరస్తా దగ్గర అనుమానస్పదంగా ఒక మోటార్ సైకిల్‌పై కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలు (Thefts) చేసినట్లు ఒప్పుకున్నారు. హుస్సేన్ నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేశాడు. ఆ సొత్తును భైంసాకు (Bhainsa) చెందిన అబూబకర్, నాంపల్లి వెంటకచారి, సాయి చరణ్‌కు విక్రయించేవాడు.
Nizamabad City | పలు ఇళ్లలో చోరీ
నగరంలోని ఒకటో, మూడో, నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ (Nizamabad Rural police station) పరిధిలోని పలు ఇండ్లలో హుస్సేన్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 70 గ్రాముల బంగారం, కొన్ని వెండి వస్తువులు , 7 చేతి గడియారలు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.