Yellareddy
Yellareddy | చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని ఓ కిరాణ దుకాణంలో చోరీకి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు. భిక్కనూరుకు (Bhiknoor) చెందిన కోడెనోళ్ల రాజు ఈనెల 11న పట్టణంలోని ఓ కిరాణదుకాణం గోదాంలో చోరీకి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా, శుక్రవారం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వాహన తనిఖీల సమయంలో నిందితుడు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతన్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని, అతని వద్ద నుంచి చోరీసొత్తు రికవరీ చేసినట్లు వెల్లడించారు.