అక్షరటుడే, గాంధారి: Gandhari Mandal | మండలంలోని నారాయణగిరి కొండపై గల మార్కండేయ ఆలయంతో (Markandeya temple) పాటు పెద్దమ్మ కాలనీలోని మరో ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తెలిపారు.
సంతోష్ కుమార్ అనే వ్యక్తి గత నెల 25 ఆలయంలోని హుండీని పగులగొట్టి డబ్బు అపహరించడంతో పాటు పెద్దమ్మ కాలనీలో సాయికుమార్ అనే వ్యక్తి బైక్ ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, సీసీ పుటేజీ (CCTV footage) ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు.
సోమవారం అరెస్ట్ చేసి, చోరీ చేసిన డబ్బులు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు పంపించామని ఎస్సై చెప్పారు. నిందితుడి పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సంజయ్ కుమార్ బంతిలాల్ను ప్రత్యేకంగా అభినందించారు.