4
అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని హాజీపూర్ తండాలో శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడిలో హుండీ చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. రాంపూర్ గ్రామానికి చెందిన పౌలు అనే వ్యక్తి ఈ నెల 14న అర్ధరాత్రి సేవాలాల్ గుడిలో హుండీ తాళం పగులగొట్టి చోరీ చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ పుటేజ్ నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అతని వద్ద చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.