అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rural CI Suresh Kumar | బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని మోపాల్ పోలీసులు(Mopal Police) శుక్రవారం అరెస్టు చేశారు. సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ (South Rural CI Suresh Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. బైక్‌లతో పాటు పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డట్టుగా నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేష్ చెప్పారు. కేసును ఛేదించిన మోపాల్ ఎస్సై యాదగిరి గౌడ్ mopal si yadagiri goud, సిబ్బందిని సీఐ అభినందించారు.
Rural CI Suresh Kumar | బైక్ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్: వాహనాలు స్వాధీనం
Published on
