Homeక్రైంACB Trap | లంచం తీసుకుంటూ దొరికిన అకౌంట్స్​ ఆఫీసర్​

ACB Trap | లంచం తీసుకుంటూ దొరికిన అకౌంట్స్​ ఆఫీసర్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏసీబీ దాడుల్లో (ACB Raids) అవినీతి అధికారులు పట్టుబడుతున్నా.. లంచాలకు అలవాటు పడిన అధికారులు భయపడటం లేదు.

తమను ఎవరూ ఏం చేయలేరని ధైర్యంగా లంచాలు అడుగుతున్నారు. పని కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజల నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ల వరకు ఎవరినీ వదలడం లేదు. పనిని బట్టి రూ.వందల నుంచి మొదలు పెడితే రూ.లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ అకౌంట్స్​ ఆఫీసర్​, కంప్యూటర్​ ఆపరేటర్​ ఏసీబీకి చిక్కారు.

ACB Trap | బిల్లులు చెల్లించడానికి లంచం

ఆదిలాబాద్​ మున్సిపల్ (Adilabad Municipality) పరిధిలో ఓ వ్యక్తి సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, హైమాస్ట్​ లైటింగ్​ పనులు రెండేళ్ల క్రితం పూర్తి చేశాడు. సదరు కాంట్రాక్టర్​కు రూ.60 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. ఇందులో రూ.3.80 లక్షల చెక్కు అందజేయడానికి ఆదిలాబాద్​ మున్సిపల్​ కార్యాలయంలోని అకౌంట్స్​ ఆఫీసర్ (Accounts Officer)​ బట్టల రాజ్​కుమార్​ రూ.15 వేల లంచం డిమాండ్​ చేశాడు.

దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం లంచం తీసుకుంటుండగా.. అకౌంట్స్​ ఆఫీసర్ రాజ్​కుమార్​తో పాటు కంప్యూటర్​ ఆపరేటర్ (Computer Operator)​ కొండ్ర రవికుమార్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

ACB Trap | అవినీతి కేంద్రాలుగా..

రాష్ట్రంలోని పలు మున్సిపల్ (Municipal), రెవెన్యూ (Revenue) కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా కార్యాలయాల్లోని చేసే కంప్యూటర్​ ఆపరేటర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు లంచాలు తీసుకోనిదే పనులు చేయరు. కొందరైతే లంచాలు తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఇంటి అనుమతులు, ఇతర పనుల నిమిత్తం వెళ్లే వారిని అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారు.

రెవెన్యూ కార్యాలయాల్లో అయితే స్లాట్​ బుక్​ చేసుకొని రిజిస్ట్రేషన్​ చేసుకుంటే కూడా పలువురు ఆపరేటర్లకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ముట్టజెప్పాల్సిందే. ఏదైనా వివాదాలు ఉన్న భూములు అయితే ఉన్నతాధికారులు ఎంట్రీ ఇచ్చి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల సక్సెషన్​ (పౌతి) కోసం కూడా ఆర్​ఐ, తహశీల్దార్​ డబ్బులు వసూలు చేస్తున్నారు.

ACB Trap | భయపడకుండా ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వారి పనిచేయడానికి డబ్బులు, లేదా ఇతర వస్తువులు అడిగినా భమ పడకుండా తమకు ఫోన్​ చేయాలని సూచిస్తున్నారు. ఏసీబీ టోల్​ ఫ్రీ నంబర్​ (ACB Toll Free Number) 1064, వాట్సాప్ నంబర్​ 9440446106కు ఫోన్​ చేసి సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడుతామని చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.