HomeUncategorizedKTR | డబుల్ ఇంజిన్ ఉన్న రాష్ట్రాల్లోనే ప్ర‌మాదాలు.. గంభీర వంతెన కూలిపోవ‌డంపై కేటీఆర్ విమ‌ర్శ‌

KTR | డబుల్ ఇంజిన్ ఉన్న రాష్ట్రాల్లోనే ప్ర‌మాదాలు.. గంభీర వంతెన కూలిపోవ‌డంపై కేటీఆర్ విమ‌ర్శ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వాలు ఉన్న చోట వంతెన‌లు త‌ర‌చూ కూలిపోతున్నాయ‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) విమ‌ర్శించారు. గుజ‌రాత్‌లోని గంభీర‌ వంతెన కూలిపోయిన ప్ర‌మాదంపై ఆయ‌న బుధ‌వారం ఎక్స్‌లో స్పందించారు. ఈ ప్ర‌మాదంపై నేష‌న‌ల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. “డ‌బుల్ ఇంజిన్ గుజ‌రాత్(Gujrat) న‌మూనాకు మ‌రో అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణ‌. మోర్బీ వంతెన కూలి 140 మందికిపైగా మ‌ర‌ణించిన త‌ర్వాత మ‌రో షాక్‌. గంభీర వంతెన(Majestic Bridge) కూలిపోవ‌డం షాక్‌కు గురి చేసింది. డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ ఉన్న గుజ‌రాత్‌, బిహార్ రాష్ట్రాల్లో త‌ర‌చూ వంతెనలు కూలిపోతున్నాయని” విమ‌ర్శించారు. ఈ ప్ర‌మాదంపై ఎన్డీఎస్ఏ, ఇత‌ర సంస్థ‌లు విచార‌ణ జ‌రుపుతాయ‌ని భావిస్తున్నాన‌ని తెలిపారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

KTR | వంతెన కూలి ముగ్గురి మృతి..

గుజరాత్‌లోని వడోదర జిల్లా(Vadodara District)లో గ‌ల‌ మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన బుధ‌వారం ఉద‌యం కూలిపోయింది. దీంతో నాలుగు వాహ‌నాలు న‌దిలో ప‌డిపోగా, ముగ్గురు మృతి చెందారు. ప‌ది మందికి పైగా గాయ‌ప‌డ్డారు. గ‌ల్లంతైన వారి కోసం స‌హాయ‌క బృందాలు గాలిస్తున్నాయి. బుధ‌వారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పద్రా పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ చరణ్(Padra Police Inspector Vijay Charan) తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు ఉన్నాయి. సహాయక బృందాలు ప‌ది మందిని ర‌క్షించారు. న‌దిలో చిక్కుకున్న ఇతరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.