అక్షరటుడే, కామారెడ్డి : Road accidents | రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు (police) చర్యలు చేపట్టారు. అతివేగంతోనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో అధికారులు స్పీడ్ కంట్రోల్ (speed control) కోసం చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు (road accidents) జరిగే ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ప్రమాదాల నివారణ కోసం వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు స్పీడ్ లిమిట్ బోర్డులను (speed limit board) ఏర్పాటు చేసిన చేశారు. తాజాగా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
Road accidents | జాతీయ రహదారిపైనే అధికం..
జిల్లాలో జాతీయ రహదారులపైనే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు (major accidents at national highway) జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కువ వేగంతో వెళ్తుండటం ఇందుకు కారణం. స్పీడ్ గన్స్‌తో (speed guns) వాహనదారులకు జరిమానా వేస్తున్న అతివేగంగా వెళ్లే వారు మాత్రం మారడం లేదు. దీంతో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి.
Road accidents | వేగం నియంత్రణకు..
కామారెడ్డి జిల్లాలో పోలీసులు (kamareddy district police) రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 28 హాట్ స్పాట్లను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వాహనాల వేగం తగ్గించేలా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండువైపులా డ్రమ్ములు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు అక్కడికి రాగానే వాహనా వేగాన్ని తగ్గిస్తున్నారు. దీంతో ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు (police) భావిస్తున్నారు.
Road accidents | హాటస్పాట్ ప్రాంతాలు ఇవే..
జాతీయ రహదారి 44పై (national highway 44) సదాశివనగర్ మండలం (sadhashiv nagar mandal) దగ్గి ఎక్స్ రోడ్, సదాశివనగర్ గ్రామం, మార్కల్ ఎక్స్ రోడ్, కుప్రియాల్ స్టేజి, టేక్రియాల్ చౌరస్తా, పొందుర్తి ఆర్టీఏ చెక్ పోస్టు, లింగాపూర్ ఎక్స్ రోడ్, ఉగ్రవాయి మైసమ్మ ఆలయం, భిక్కనూర్ ఆర్టీఏ చెక్ పోస్టు, జంగంపల్లి, బీడీఎస్ చౌరస్తా, భిక్కనూరు గేట్, భిక్కనూర్ చౌరస్తా వద్ద ఎక్కవగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే మాచారెడ్డి మండలం ఘనపూర్ పెద్దమ్మ అటవీ ప్రాంతంలో, మాచారెడ్డి ఎక్స్ రోడ్, పాల్వంచ మర్రి, భవానిపేట డబుల్ బెడ్ రూమ్స్, ఆరేపల్లి చౌరస్తా, కామారెడ్డి పోలీస్ స్టేషన్ (kamareddy police station) పరిధిలో సిరిసిల్ల రోడ్డు ఎల్లమ్మ టెంపుల్, ఇందిరా చౌక్, నిజాంసాగర్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, నస్రుల్లాబాద్ కొచ్చెరువు ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు.