అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ (Rajendra Nagar) ఓఆర్ఆర్పై వరుసగా ఏడు కార్లు ఢీకొన్నాయి.
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏడు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాదంతో రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Hyderabad | సడెన్ బ్రేక్ వేయడంతో..
ఓ కారు డ్రైవర్ అతివేగంగా వెళ్తూ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న ఏడుకార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. రాజేంద్రనగర్ నుంచి అప్పా (APPA) వైపు వెళ్తుండగా.. హిమాయత్ సాగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజేంద్రనగర్ ORRపై రోడ్డు ప్రమాదం
ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్న 7కార్లు
శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదంప్రమాదంలో పలువురికి గాయాలు
#ORR #accident #TV9Telugu pic.twitter.com/uwSLfyIZb1— TV9 Telugu (@TV9Telugu) October 5, 2025