అక్షరటుడే, వెబ్‌డెస్క్:Jurala Project | జూరాల ప్రాజెక్ట్ పై ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న యువకుడు ఎగిరి నదిలో పడి కొట్టుకుపోయాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూరాల ప్రాజెక్టు(Jurala Project)పై వెళ్తున్న కారు 53వ గేట్ వద్దకు వెళ్లగానే, ఎదురుగా వస్తున్న బైక్(Bike)ను ఢీకొట్టింది. దీంతో బైక్ మీద ఉన్న యువకుడు ఎగిరి ప్రాజెక్టులోకి పడగా, మరొకరికి గాయాలయ్యాయి. నదిలో పడిన యువకుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) మానవపాడు మండలం బూడిదపాడు గ్రామ (Budidapadu Viilage) వాసి మహేశ్‌గా గుర్తించారు. సెర్చ్ ఆపరేషన్‌లో ఇప్పటివరకూ యువకుడి ఆచూకీ లభించలేదు. అతని కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.
Jurala Project | కనిపించని భద్రతా చర్యలు..
ప్రాజెక్టుపై వాహనాలను అనుమతించడంపై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. కీలకమైన ఈ ప్రాజెక్టు పైనుంచి వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. కృష్ణా నదికి వరదలు వచ్చి, ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు తరలి వస్తారు. వంతెనపై ప్రమాదకర స్థితిలో సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. ప్రాజెక్టు వద్ద భద్రతా చర్యలు చేపట్టడంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టు పరిసరాల్లో నిషేధ ఆజ్ఞలు విధించక పోవడం, పర్యాటకుల భద్రతను పట్టించుకోక పోవడంపై అనేక విమర్శలు ఉన్నాయి.