Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | పంట ఉత్పత్తుల కొనుగోళ్లను వేగవంతం చేయండి: కలెక్టర్​

Collector Nizamabad | పంట ఉత్పత్తుల కొనుగోళ్లను వేగవంతం చేయండి: కలెక్టర్​

కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. బోధన్ మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం (Bodhan mandal) బండార్ పల్లిలో మార్క్​ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని, కల్దుర్కిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు.

సోయాబీన్ సేకరణ కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన సోయాబీన్ నిల్వల నాణ్యతను పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో సోయాబీన్ కొనుగోలు చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు (farmers) ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Collector Nizamabad | ఇబ్బందులు తలెత్తవదు..

ప్రతి కేంద్రంలో సరిపడా గన్నీ బ్యాగులు (gunny bags) అందుబాటులో ఉంచాలని, రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అనంతరం కల్దుర్కి గ్రామంలోని (Kaldurki village) వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైస్​మిల్లులకు ఎన్ని లోడ్​ల లారీలు వెళ్లాయి. ట్రక్​షీట్లు వెనువెంటనే తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేస్తున్నారా అని ఆరా తీశారు.

Collector Nizamabad | రికార్డుల పరిశీలన..

ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు వివరాలతో కూడిన రికార్డులను కలెక్టర్​ పరిశీలించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరినందున కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ జరిగిన మీదట కొనుగోలు కేంద్రాలను (purchase centers) మూసివేసే ముందు ట్రక్​ షీట్​లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

17 శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు (Farmers) కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం జరిపెంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన కాకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, మార్క్​ఫెడ్ డీఎం మహేష్, బోధన్ తహశీల్దార్ విఠల్, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.

Must Read
Related News