అక్షరటుడే, న్యూఢిల్లీ: ACC meeting | ఆసియా కప్ 2025 Asia Cup 2025 గెలిచిన భారత్ జట్టకు ఇవ్వాల్సిన ట్రోఫీని పాక్ తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది.
ట్రోఫీని భారత్కు ఇవ్వాల్సిందేనని బీసీసీఐ హెచ్చరించినా.. పాక్ పట్టించుకోలేదు. దీంతో మంగళవారం (సెప్టెంబరు 30) ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) Asian Cricket Council మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశం ఆసాంతం ఉత్కంఠంగా సాగింది.
ఈ సమావేశానికి భారత్ తరఫున బీసీసీఐ BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ కోశాధికారి ఆశిష్ శేఖర్ హాజరయ్యారు. భారత్ గెలిచిన ట్రోఫీని పాకిస్తాన్ తీసుకెళ్లడంపై ఈ మీటింగ్లో బీసీసీఐ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఏసీసీ ఛైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.
కానీ, ట్రోఫీ ఇచ్చేందుకు నఖ్వీ ఒప్పుకున్నట్లు కనిపించడం లేదు. ఏసీసీ సమావేశంలో ట్రోఫీ గురించి నఖ్వీ మాట్లాడక పోవడంపై విమర్శలకు దారితీసింది.
ఈ సమావేశంలో ఆసియా కప్ గురించి మాట్లాడిన నఖ్వీ.. ట్రోఫీ గెలిచిన భారత్కు శుభాకాంక్షలు తెలపకపోవడంపై ఆశిష్ శేఖర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో ఆ తర్వాత స్పందించిన నఖ్వీ అభినందనలు తెలిపినట్లు శేఖర్ చెప్పారు.
ACC meeting | ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం..
పాక్ క్రికెట్ బోర్డుకు కానీ, ఏసీసీకి కానీ ట్రోఫీని టీమిండియాకు ఇచ్చే ఉద్దేశం కనిపించలేదని బీసీసీఐ ప్రతినిధులు చెబుతున్నారు. దీనిపై ఐసీసీ (ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్) కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
ఆదివారం (సెప్టెంబరు 28) ఆసియా కప్ 2025 ఫైనల్ లో భారత్ గెలిచినప్పటికీ.. ఏసీసీ ఛైర్మన్గా ఉన్న పాక్ మంత్రి చేతుల నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా జట్టు సభ్యులు నిరాసక్తత కనబర్చారు.
అయితే నిబంధనల ప్రకారం ట్రోఫీని టీమిండియాకు అప్పగించాలి. లేదంటే ఐసీసీకి పంపించాలి. కానీ, నఖ్వీ అలా చేయకుండా వెంట తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది.