Tahsildar caught by ACB | తహసీల్దారు నుంచి డీఈవో వరకు అందరూ లంచావతారులే.. ఒకే ఆఫీస్​లో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు!
Tahsildar caught by ACB | తహసీల్దారు నుంచి డీఈవో వరకు అందరూ లంచావతారులే.. ఒకే ఆఫీస్​లో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tahsildar caught by ACB | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి భయం లేకుండా.. లంచాలకు ఎగబడుతున్నారు.

ఏసీబీ అధికారులు (ACB Officers) ఇటీవల నిత్యం దాడులు చేపడుతున్నారు. అయినా లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు.

వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను డబ్బులు అడుగుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు.

లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా ఖమ్మంలో తహసీల్దారు, రెవెన్యు ఇన్​స్పెక్టరు​ (RI), డేటా ఎంట్రీ ఆపరేటర్​ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

Tahsildar caught by ACB | భూమి నమోదు చేయడానికి..

ఖమ్మం Khammam జిల్లా తల్లాడ మండలంలో ఓ రైతు తాను కొనుగోలు చేసిన భూమిని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్​ చేసేందుకు, దాన్ని ప్రాసెస్ చేసేందుకు బాధితుడి నుంచి రెవెన్యూ అధికారులు రూ.10,000 లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డారు.

పట్టుబడిన వారిలో తహసీల్దారు Tahsildar వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టరు Revenue Inspector మాలోత్ భాస్కర్ రావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ Data Entry Operator శివాజీ రాథోడ్ ఉన్నారు.

Tahsildar caught by ACB | జోరుగా అవినీతి

రెవెన్యూ శాఖలో అవినీతి జోరుగా సాగుతోంది. పలు తహశీల్దార్​ కార్యాలయాల్లో (Tahsildar’s office) పైసలు ఇస్తేనే పనులు సాగుతాయి.

పలువురు అటెండర్​, ఆపరేటర్​ నుంచి మొదలు పెడితే తహశీల్దార్ల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు తహశీల్దార్లు ఆపరేటర్లు, కింది స్థాయి సిబ్బందితో డబ్బులు వసూలు చేయిస్తున్నారు.

అయినా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​ కోసం కూడా కొందరు అధికారులు డబ్బులు అడుగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ACB trap | లంచం ఇవ్వొద్దు

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు.

1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.

ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.