Homeజిల్లాలునిజామాబాద్​ACB Raid | ఏసీబీ సోదాల కలకలం

ACB Raid | ఏసీబీ సోదాల కలకలం

నిజామాబాద్​ జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. నిజామాబాద్​ అర్బన్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB Raid | నిజామాబాద్​ జిల్లాలో (Nizamabad district) ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. నిజామాబాద్​ అర్బన్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో (Nizamabad Urban Sub-Registrar’s office) ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు.

నిజామాబాద్​ అర్బన్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు (Anti-Corruption Department officials) సోదాలు జరపడం తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడ పట్టారు. అలాగే అధికారులు, సిబ్బందిని విచారించడంతో పాటు వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నేరుగా దాడి చేశారా.. లేక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. సోదాల అనంతరం పూర్తి వివరాల మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

మరోవైపు అర్బన్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో గత కొద్ది రోజులుగా నాన్​ లేఅవుట్​ ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఓ సబ్​ రిజిస్ట్రార్​ కనుసన్నల్లో ఈ తంతు జరుగుతోంది. ఒక్కో ప్లాట్​కు రేటును ఫిక్స్​ చేసి మరీ డాక్యుమెంట్లు పూర్తిచేసి పెడుతున్నారు. ఈ క్రమంలో ఏసీబీ సోదాలు జరపడం చర్చకు దారితీసింది. పక్కా సమాచారంతోనే దాడులు చేశారని తెలుస్తోంది.

Must Read
Related News