ePaper
More
    HomeతెలంగాణACB Raids | బీసీ హాస్టల్​లో ఏసీబీ సోదాలు

    ACB Raids | బీసీ హాస్టల్​లో ఏసీబీ సోదాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | నాగర్​కర్నూల్ (Nagar Kurnool)​ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ బాలుర హాస్టల్ (Achampet BC Hostel)​లో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar) యూనిట్ ACB అధికారులు హాస్టల్​లో తనిఖీలు చేశారు.

    లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్ సాయంతో హాస్టల్​లో పరిశీలించారు. ఆహారం నాణ్యత, పరిమాణం, పారిశుధ్య పరిస్థితులు, విద్యార్థుల వివరాలు, హాస్టళ్ల రికార్డులను తనిఖీ చేశారు. సోదాల సమయంలో హాస్టల్‌లో కొన్ని అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సంబంధిత అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపుతామని అధికారులు తెలిపారు.

    ACB Raids | అనేక ఆరోపణలు

    రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో (Welfare Hostels) వార్డెన్​లపై అనేక ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది వార్డెన్​లు స్థానికంగా ఉండరు. విద్యార్థులకు నాసిరకం సరుకులు, కూరగాయలతో వంటలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి బిల్లులు కాజేస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో హాస్టల్​లో ఏసీబీ అధికారులు దాడులు చేయడం గమనార్హం. గతంలో ఎప్పుడైనా హాస్టళ్లను సంబంధిత అధికారులు మాత్రమే తనిఖీ చేసేవారు. ప్రస్తుతం ఏసీబీ దాడులు చేయడంతో అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్​లలో భయం పట్టుకుంది.

    More like this

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...