అక్షరటుడే, బిచ్కుంద: ACB Raids | బిచ్కుంద పోలీస్‌స్టేషన్(Bichkunda Police Station)లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా కేసులో వాహనాలను వదిలేసే విషయంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో తనిఖీలు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ(ACB DSP) శేఖర్ గౌడ్ తెలిపారు. ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేసినా.. వదిలేసే విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు గుర్తించామన్నారు. స్టేషన్ ఆవరణలో 10 ఇసుక ట్రాక్టర్లను గుర్తించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. ఇది ట్రాప్ కేసు కాదని.. ఆకస్మిక తనిఖీలు మాత్రమేనని వివరించారు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోదాలు చేశామన్నారు. పలు ఆధారాలు లభించాయని.. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.
ACB Raids | బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన అధికారులు
3