ePaper
More
    HomeతెలంగాణACB Raids | ఏసీబీ దూకుడు.. ఎంత మంది చిక్కారో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే..

    ACB Raids | ఏసీబీ దూకుడు.. ఎంత మంది చిక్కారో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిత్యం దాడులు, తనిఖీలు చేస్తూ లంచాలకు మరిగిన వారి పని పడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్​ వరకు కేసుల వివరాలను ఏసీబీ తాజాగా వెల్లడించింది.

    ACB Raids | మొత్తం 31 కేసులు

    ఈ ఏడాది జూన్​లో ఏసీబీ అధికారులు(ACB Officers) మొత్తం 31 కేసులు/విచారణలు నమోదు చేశారు. ఇందులో వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు అక్రమాస్తుల కేసులు, మూడు క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు ఉన్నాయి. నాలుగు రెగ్యులర్ ఎంక్వైరీలు, ఏడుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

    ACB Raids | 25 మంది ఉద్యోగులపై కేసు

    ఏసీబీ అధికారులు తమ దాడుల్లో భాగంగా పలువురు అధికారులను రెడ్​ హ్యాండెడ్​(Red Handed)గా పట్టుకున్నారు. అంతేగాకుండా అక్రమాస్తులు కలిగి ఉన్న వారిని సైతం అరెస్ట్​ చేశారు. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు సహా ఇరవై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులను(Government Employees) అరెస్ట్​ చేసి జ్యూడీషియల్​ రిమాండ్​కు తరలించారు. ట్రాప్​ కేసుల్లో రూ.3,43,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు అక్రమాస్తుల కేసుల్లో రూ.13,50,000, రూ.5,22,75,000 విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఆర్టీఏ చెక్​పోస్టులు, సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ లెక్కల్లో చూపని రూ.2,72,030 మొత్తాన్ని సీజ్​ చేశారు.

    ACB Raids | ఆరు నెలల్లో 126 కేసులు

    ఈ ఏడాది జనవరి నుంచి జూన్​ 30 వరకు ఏసీబీ 126 కేసులను నమోదు చేసింది. ఇందులో 80 ట్రాప్ కేసులు, 8 అసమాన ఆస్తుల కేసులు, 14 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 10 రెగ్యులర్ ఎంక్వైరీలు, 11 ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. ఎనిమిది మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులతో సహా 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. ట్రాప్ కేసుల్లో రూ.24,57,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2025 జూన్​ 30 వరకు ఏసీబీ 129 కేసులను ఖరారు చేసి, ప్రభుత్వానికి తుది నివేదికలను పంపింది

    More like this

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...