Homeజిల్లాలుకామారెడ్డిACB Raid | పొందుర్తి చెక్​పోస్టుపై ఏసీబీ దాడులు.. రూ.51,300 సీజ్​

ACB Raid | పొందుర్తి చెక్​పోస్టుపై ఏసీబీ దాడులు.. రూ.51,300 సీజ్​

రాజంపేట మండలం పొందుర్తి చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఏఎంవీఐతో పాటు ప్రైవేట్​ ఏజెంట్ల వద్ద లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : ACB Raid | రాజంపేట మండలం పొందుర్తి చెక్ పోస్టుపై (Padmanurthi check post) మరోసారి ఏసీబీ పంజా విసిరింది. నిబంధనలకు విరుద్ధంగా ఏజెంట్లను నియమించుకుని వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై శనివారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడులు చేపట్టింది.

ఏసీబీ దాడుల్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (Assistant Motor Vehicle Inspector) మొహమ్మద్ అఫ్రోజుద్దీన్ వద్ద లెక్కల్లో లేని రూ.5 వేలు అధికారులు గుర్తించారు. అలాగే ముగ్గురు ప్రైవేట్ ఏజెంట్లు వాహనదారుల నుంచి నగదు వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. సుమారు రెండు గంటల పాటు ఏసీబీ చెక్ పోస్టులో సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో లెక్కల్లో లేని రూ.51,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ACB Raid | ప్రైవేట్​ ఏజెంట్లతో..

వాహనాలపై జరిమానాలు విధించకుండా, డ్రైవర్లు, వాహన యజమానుల నుంచి డబ్బు వసూలు చేయడానికి ఆర్టీఏ సిబ్బంది (RTA staff) ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకున్నట్లు గుర్తించారు. అధికారులపై అవసరమైన చర్యను సిఫార్సు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఏసీబీ తెలిపింది. ఎవరైనా అధికారులు లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా ప్రజలు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా 9440446106 నంబరుకు తెలియజేయాలని ఏసీబీ అధికారులు కోరారు.

ACB Raid | మూడు నెలల్లో రెండోసారి దాడులు

పొందుర్తి చెక్ పాయింట్​పై ఏసీబీ జులై 16న దాడులు చేపట్టింది. దాడుల్లో అసిస్టెంట్ ఎంవీఐ రిచర్డ్ సన్ వద్ద నగదుతో పాటు ప్రైవేట్ ఏజెంట్ల (private agents) వద్ద డబ్బులను పట్టుకున్నారు. మొత్తం రూ.52 వేలు సీజ్ చేశారు. మూడు నెలల వ్యవధిలోనే మరోసారి దాడులు చేయడం కలకలం రేపింది. అలాగే జిల్లాలోని మద్నూర్​ మండలం సలబత్​పూర్​ చెక్​పోస్టులో సైతం అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులను ప్రభుత్వం ఎత్తివేయనుందని ప్రచారం సాగుతున్న క్రమంలో మరోసారి ఏసీబీ దాడులు జరగడం చర్చకు దారి తీసింది.