HomeతెలంగాణACB raids | కడెం తహశీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్

ACB raids | కడెం తహశీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB raids | నిర్మల్ జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టా మార్పిడికోసం లంచం తీసుకుండగా అడ్డంగా దొరికాడు.

నిర్మల్ జిల్లాలోని (Nirmal district) కడెం తహశీల్దార్​ కార్యాలయంలో (Kadem Tahsildar office) శనివారం అనిశా అధికారులు సోదాలు చేశారు. ఓ రైతు నుంచి సర్వేయర్ పవార్ ఓమాజీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. పట్టామార్పిడి విషయంలో ఓ రైతు నుంచి రూ. 20వేలు డిమాండ్ చేశాడు. అయితే అంత ఇచ్చుకోలేనని రూ.7వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో తహశీల్దార్​ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా సర్వేయర్ ఓమాజీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.