Homeజిల్లాలువరంగల్​ACB Raids | వరంగల్‌లో ఏసీబీ దాడుల కలకలం

ACB Raids | వరంగల్‌లో ఏసీబీ దాడుల కలకలం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. వరుస దాడులతో అవినీతి అధికారుల పని పడుతున్నారు. లంచాలు (bribes) తీసుకుంటున్న వారిని వల పన్ని పట్టుకుంటున్నారు.

ఏసీబీ దాడులతో (ACB raids) లంచాలకు మరిగిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వరుస దాడులు చేపడుతుండటంతో లంచాలు తీసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే డబ్బులు తీసుకోవడం మాత్రం మానడంలేదు. ఏసీబీ అధికారులు శుక్రవారం వరంగల్​ జిల్లాలో (Warangal district) సోదాలు చేపట్టారు.

ACB Raids | తహశీల్దార్​ ఇంట్లో సోదాలు

ఖిల్లా వరంగల్ తహశీల్దార్ నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో శుక్రవారం ఉదయం అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. తహశీల్దార్​ ఇల్లు, కార్యాలయంతో పాటు, హనుమకొండలోని (Hanumakonda) చైతన్యపురి, ఖమ్మంలోని (Khammam) ఇళ్లలో సైతం సోదాలు చేపట్టారు. ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ACB Raids | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.