అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | నిజామాబాద్ నగర కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు (ACB Raids) కలకలం రేపాయి. కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగం కీలకం. అయితే నిజామాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులపై కొంతకాలంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారులు మాముళ్లు తీసుకొని చూసి చూడనట్లు ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణ సమయంలో సైతం భారీ ఎత్తున డబ్బులు తీసుకుంటారని సమాచారం. ఈ క్రమంలో తాజాగా ఏసీబీ అధికారులు (ACB Officers) సోదాలు చేయడం గమనార్హం. అయితే దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ACB Raids | అధికారుల్లో కలవరం
ఏసీబీ అధికారులు ఇటీవల నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో వరుసగా సోదాలు చేపడుతున్నారు. దీంతో అవినీతి అధికారుల్లో కలవరం మొదలైంది. ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ నెల 14న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తనిఖీలు చేపట్టింది. 18న విద్యా శాఖ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తాజగా.. కార్పొరేషన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో (Town Planning Section) సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో లంచాలు తీసుకునే అధికారులు భయ పడుతున్నారు.
