3
అక్షరటుడే, ఆర్మూర్: ACB raids | ఆర్మూర్ మున్సిపల్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. మున్సిపల్ కమిషనర్ రాజు ఇంట్లో సోదాలు చేసినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. కమిషనర్ రాజు (Aamoor Municipal Commissioner Raju) ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. ఓ బిల్డింగ్ పర్మిషన్ (building permit) విషయంలో దరఖాస్తు దారుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. గురువారం పట్టణంలోని యోగేశ్వర కాలనీలోని తన నివాసంలో మున్సిపల్ కమిషనర్ డబ్బులు తీసుకుంటుండగా.. అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.