అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పడుతున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (Deputy Transport Commissioner) ఇంట్లో సోదాలు చేపట్టారు.
రాష్ట్రంలో పలు కార్యాలయాల్లో అవినీతి జోరుగా సాగుతోంది. తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, రవాణా శాఖ కార్యాలయాలకు అవినీతి కేంద్రాలుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఏసీబీ అధికారులు (ACB Officers) వల పన్ని అవినీతి అధికారులను పట్టుకుంటున్నారు. అలాగే అక్రమాస్తుల కేసులు నమోదు చేసి తనిఖీలు చేపడుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో తాజాగా అధికారులు మహబూబ్‌నగర్ (Mahbubnagar) డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో సోదాలు చేపట్టారు.
ACB Raid | రూ.100 కోట్ల ఆస్తులు
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. మంగళవారం ఉదయం ఆయన నివాసాల్లో సోదాలు చేపట్టింది. రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లతో పాటు మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు. కిషన్ నాయక్‌తో పాటు మరో నలుగురు అధికారుల ఇళ్లలో సైతం తనిఖీలు చేపడుతున్నారు. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.