ePaper
More
    HomeతెలంగాణACB Raids | ఇరిగేషన్​ శాఖ ఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

    ACB Raids | ఇరిగేషన్​ శాఖ ఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:ACB Raids | తెలంగాణ(Telangana)లో ఏసీబీ అధికారుల దాడులు మరోసారి కలకలం రేపాయి. బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్​ఇంజనీర్ ​(Irrigation Department Executive Engineer) ఇంట్లో దాడులు చేపట్టారు. ఆదాయనికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏకకాలంలో 12 చోట్ల దాడులు చేస్తున్నారు.

    ACB Raids | ఏకకాలంలో అధికారుల సోదాలు

    కరీంనగర్​ జిల్లా చొప్పదండి ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయం(SRSP Camp Office)లో ఈఈగా నూనె శ్రీధర్​ పని చేస్తున్నాడు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్వహణలో సైతం ఆయన పని చేశారు. అయితే శ్రీధర్​ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ(ACB)కి సమాచారం అందింది. దీంతో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు (ACB Officers) ఆయన ఇళ్లపై దాడులు చేశారు.

    నూనె శ్రీధర్​కు సంబంధించి హైదరాబాద్​, కరీంనగర్​, సిద్దిపేటలోని 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఈయన కాళేశ్వరం ప్రాజెక్ట్​(Kaleshwaram Project)లో 6, 7, 8 ప్యాకేజీ పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్​ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీధర్​ భారీగా కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించ ఏసీబీ దాడులు చేపట్టింది. ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.

    More like this

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...