HomeతెలంగాణACB Raids | ఆర్టీఏ చెక్​పోస్టుల్లో ఏసీబీ దాడులు

ACB Raids | ఆర్టీఏ చెక్​పోస్టుల్లో ఏసీబీ దాడులు

ACB Raids | రాష్ట్రంలోని పలు ఆర్టీఏ చెక్​పోస్టుల్లో ఏసీబీ అధికారులు శనివారం రాత్రి దాడులు చేపట్టారు. లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఆర్టీఏ చెక్​పోస్టు (RTA Check Post)ల్లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టి అక్రమంగా వసూలు చేసిన నగదు సీజ్​ చేశారు.

కామారెడ్డి (Kamareddy) జిల్లా మద్నూర్​ మండలం సలబత్​పూర్​ అంతర్రాష్ట్ర చెక్​పోస్టు​లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.36 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్​ వ్యక్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అలాగే సంగారెడ్డి, నారాయణపేట, అశ్వరావుపేటలోని చెక్​పోస్టుల్లో సైతం అధికారులు సోదాలు చేపట్టారు. లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు.

ACB Raids | జోరుగా వసూళ్లు

ఆర్టీఏ చెక్​పోస్టుల్లో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న అధికారులు డ్రైవర్ల నుంచి మామూళ్లు తీసుకోవడం మానడం లేదు. మద్నూర్​లోని అంతర్రాష్ట్ర చెక్​పోస్టుపై ఏసీబీ అధికారులు జూన్​లో దాడులు చేశారు. అప్పుడు కూడా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయినా అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ప్రైవేట్​ ఏజెంట్ల ద్వారా డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పొందుర్తి చెక్​పోస్టు (Pondurti Checkpost)లో సైతం అధికారులు గతంలో దాడులు చేపట్టారు. లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు.