Homeజిల్లాలుకామారెడ్డిACB Raids | అంతర్రాష్ట్ర చెక్​పోస్టులో ఏసీబీ సోదాల కలకలం

ACB Raids | అంతర్రాష్ట్ర చెక్​పోస్టులో ఏసీబీ సోదాల కలకలం

- Advertisement -

అక్షరటుడే, బిచ్కుంద :ACB Raids | అంతర్రాష్ట్ర చెక్​పోస్టులో ఏసీబీ అధికారులు సోదాలు (ACB Raids) చేయడం కలకలం రేపింది. కామారెడ్డి(Kamareddy district) జిల్లా మద్నూర్ మండలం సలబత్​పూర్​ వద్ద మహారాష్ట్ర సరిహద్దులో రవాణా శాఖ ఆధ్వర్యంలో చెక్​పోస్టు కొనసాగుతోంది. ఈ చెక్​పోస్టులో బుధవారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఏసీబీ డీఎస్పీ శేఖర్(ACB DSP Shekhar goud)​ ఆధ్వర్యంలో చెక్​పోస్టులో సోదాలు చేశారు. ఆ సమయంలో విధుల్లో ఏఎంవీఐ కవితతో పాటు సిబ్బంది, ఇద్దరు ప్రైవేట్​ వ్యక్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో సైతం ఈ చెక్​పోస్ట్​లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రాత్రిపూట చెక్​పోస్ట్​ సిబ్బంది తనిఖీల పేరిట వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

చెక్​పోస్టులో లెక్కకు మించి నగదు ఉన్నట్లు గుర్తించారు. ఏడాదిలో చెక్​పోస్టు(Checkpost)పై రెండుసార్లు దాడులు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే గతంలో సైతం తనిఖీల సమయంలో డబ్బు దొరికినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో చెక్​పోస్ట్​ సిబ్బంది భయం లేకుండా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా రవాణా శాఖ అధికారులు మాత్రం తీరు మార్చుకోవట్లేదు.

ACB Raids | చేతులు తడపాల్సిందే..

మద్నూర్​ మండలం(Madnur Mandal)లోని చెక్​పోస్టు సిబ్బందిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. భారీ వాహనాలను తనిఖీల పేరిట ఆపి లంచాలు డిమాండ్​ చేస్తున్నట్లు సమాచారం. అధికారుల చేతులు తడిపితేనే.. వాహనాలను కదలిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడులు చేయడం గమనార్హం. ఈ ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.