అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | ట్రాన్స్ఫార్మర్ transformer ఏర్పాటు చేయడానికి లంచం అడిగిన ఏఈని ఏసీబీ acb అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ hyderabadలోని ప్రగతి నగర్ pragathi nagarకు చెందిన వ్యక్తి తన ప్లాట్‌లో 63కేవీ ట్రాన్స్ఫార్మర్, తొమ్మిది విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని టీజీఎస్పీడీసీఎల్ ఏఈ(ఆపరేషన్స్) జ్ఞానేశ్వర్‌ను కలిశాడు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి ఏఈ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బుధవారం బాధితుడి నుంచి రూ.పది వేల లంచం తీసుకుంటుండగా ఏఈ జ్ఞానేశ్వర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
