Homeజిల్లాలునిజామాబాద్​ACB Raid | విద్యాశాఖ కార్యాలయానికి ఏసీబీ అధికారులు

ACB Raid | విద్యాశాఖ కార్యాలయానికి ఏసీబీ అధికారులు

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు పలు వివరాలను సేకరించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: ACB Raid | జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో (district education office) మంగళవారం ఏసీబీ అధికారులు పలు వివరాలను సేకరించారు. ఏసీబీ డీఎస్పీ, ఇద్దరు సీఐలు డీఈవో కార్యాలయానికి రావడంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ( District Education Officer Ashok ) కలెక్టర్​తో సమీక్షలో ఉండడంతో ఏసీబీ అధికారులు సిబ్బంది ద్వారా వివరాలను సేకరించారు.

ACB Raid | పీఎంశ్రీ పథకం వివరాల సేకరణ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకంపై (PMShri scheme) జిల్లాకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 40 పాఠశాలలు పీఎంశ్రీకి ఎంపిక అయ్యాయి. వీటి అభివృద్ధికి, విద్యార్థుల మెరుగుదలకు, ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లలో నిధులను కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే జిల్లాకు ఎన్ని నిధులు విడుదలయ్యాయి. ఇలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు. విద్యార్థులకు అవసరమైన పరికరాలు కొనుగోలు, ఇప్పటివరకు ఎన్ని నిధులు ఖర్చు చేశారు. ఇంకా ఎన్ని నిధులు ఉన్నాయి, తదితర వివరాలను సేకరించినట్లు సమాచారం.