HomeతెలంగాణACB Case | ఐఏఎస్‌ అధికారికి ఏసీబీ నోటీసులు.. ఎందుకో తెలుసా..!

ACB Case | ఐఏఎస్‌ అధికారికి ఏసీబీ నోటీసులు.. ఎందుకో తెలుసా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Case | ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణ (ACB investigation) కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ను (KTR) అధికారులు రెండు సార్లు విచారించారు. అంతేగాకుండా పలువురు అధికారులను సైతం విచారించారు. తాజాగా ఓ ఐఏఎస్​ అధికారికి (IAS officer) సైతం ఏసీబీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్​లో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసులో (Formula E car race) అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేబినెట్​ ఆమోదం లేకుండానే అప్పటి మంత్రి కేటీఆర్​ నిధులు కేటాయించారని ఏసీబీ పేర్కొంటుంది. నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా ఐఏఎస్ అరవింద్ ​కుమార్​కు (IAS Arvind Kumar) ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జులై 1న విచారణకు రావాలని ఆదేశించింది.

ACB Case | విదేశాల్లో అరవింద్​ కుమార్​

ఫార్ములా ఈ రేసులో ఐఏఎస్​ అరవింద్​ కీలకంగా వ్యవహరించారు. దీంతో ఇప్పటికే అధికారులు ఆయనను పలుమార్లు విచారించారు. అయితే ఇటీవల కేటీఆర్​ను విచారించిన అధికారులు.. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరోసారి అరవింద్​కుమార్​ను (Arvind Kumar) విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే అరవింద్​ కుమార్​ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. కుమార్తె కాన్వొకేషన్​ కోసం ఆయన యూరప్​ వెళ్లారు. ఈ నెల 30 ఆయన హైదరాబాద్​ (Hyderabad) రానున్నట్లు సమాచారం. దీంతో జులై 1న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Must Read
Related News