3
అక్షరటుడే, బిచ్కుంద: ACB Raids | జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దులోని సలాబత్పూర్ రవాణా శాఖ చెక్‌పోస్టుపై (Salabatpur Transport Department Checkpost) ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిజామాబాద్ రేంజ్ ఏసీబీ (Nizamabad Range ACB) డీఎస్పీ శేఖర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై ఉన్న చెక్‌పోస్టులో వాహనాల తనిఖీల పేరిట వసూళ్లు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో దాడులు జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.