HomeతెలంగాణACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టెక్నికల్ అసిస్టెంట్​

ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టెక్నికల్ అసిస్టెంట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీ (ACB)కి చిక్కాడు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించుకున్న పశువుల షెడ్​ బిల్లుల కోసం ఓ అధికారి రూ.10 వేల లంచం డిమాండ్​ చేశాడు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS)లో భాగంగా ప్రభుత్వం పశువుల షెడ్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. మొదట షెడ్డు నిర్మించుకొని దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తోంది. అయితే బిల్లులు ప్రాసెస్​ చేయడానికి టెక్నికల్​ అసిస్టెంట్​ డబ్బులు డిమాండ్​ చేశారు. అతడిని ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

మంచిర్యాల (Mancherial) జిల్లా కన్నెపల్లి ఎంపీడీవో (MPDO) కార్యాలయంలో పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి విభాగంలో బానోత్ దుర్గా ప్రసాద్ టెక్నికల్ అసిస్టెంట్​గా పని చేస్తున్నాడు. మండల పరిధిలోని ఓ వ్యక్తి ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించుకున్న షెడ్డుకు బిల్లులు మంజూరు చేయాలని ఆయనను కలిశాడు. షెడ్డు కొలతలు తీసి, ఎం బుక్​లో నమోదు చేయడానికి, పెండింగ్ బిల్లును మంజూరు చేయడానికి ఆయన రూ.10 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శనివారం టెక్నికల్​ అసిస్టెంట్​ దుర్గాప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్​ చేశారు.

కాగా ఏసీబీ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ అవినీతి అధికారులను అరెస్ట్​ చేస్తున్నారు. శనివారం రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటుండగా.. మేడ్చల్ (Medchal)​ జిల్లా ఎల్లంపేట మున్సిపల్​ ఆఫీస్​ టౌన్​ ప్లానింగ్​ అధికారి రాధాకృష్ణా రెడ్డిని ఏసీబీ పట్టుకుంది. శుక్రవారం సైతం మణుగూరు ఎస్సై (Manuguru SI) పై కేసు నమోదు చేసింది. హైదరాబాద్​లోని గచ్చిబౌలి డివిజన్​ జూనియర్​ లైన్​మన్​ను వల పన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Must Read
Related News